'సర్వే'జనా బిజెపి నినాదం
అయితే, బిజెపి నినాదానికి అంశాన్ని ఎంపిక చేసిన పద్ధతి కూడా ఆశ్చర్యం కలిగించదు. వోటర్లను ఆకట్టుకునే కృషికి తోడు, అభ్యర్థుల ఎంపిక నుంచి నియోజకవర్గాల వారీగా ప్రచార నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు పార్టీ ఎన్నికల సరళి అధ్యయన శాస్త్రం 'సెఫాలజీ'ని ఉపయోగించుకోవడంలో కూడా ముందడుగు వేసింది. వాస్తవ పరిస్థితుల గురించి అంచనాకు రావడానికి చాలా పార్టీలు ఎన్నికల సర్వేక్షకుల సాయం తీసుకుంటున్నప్పటికీ, బిజెపి ఇప్పుడు రాజకీయ విశ్లేషణల కన్నా ఈ సర్వేలకే ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నది. బిజెపి బయటకు మాత్రం సర్వేలను, ఒపీనియన్ పోల్స్ ను గర్హిస్తుంటుంది. ఆర్థిక మాంద్యం, ఆంతరంగిక భద్రత వంటి అంశాలపై బిజెపి ఎక్కువగా దృష్టి పెడుతోందంటే అందుకు సర్వే ఫలితాలే కారణం.
బిజెపి ఈ సర్వేలనే ఎక్కువగా నమ్ముకోవడమనేది మధ్య ప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైంది. ఉగ్రవాదం, సైద్ధాంతిక అంశాలపైనే తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని బిజెపి తొలుత సంకల్పించింది. కాని, సర్వే ఫలితాల ప్రాతిపదికగా శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యక్తగత ఆకర్షణపైనే ఎక్కువగా ఆధారపడడంతో బిజెపి వ్యూహమే మారిపోయింది. ఆ ఎన్నికల ఫలితాలను బిజెపి కేంద్ర నాయకత్వాన్ని ఎంతగా సమ్మోహనపరిచాయంటే పార్టీ జాతీయ సమితిలోకి సుప్రసిద్ధ ఎన్నికల సర్వేక్షకుడు జి.వి.ఎల్. నరసింహారావును చేర్చుకున్నది. నరసింహారావు ఇప్పుడు బిజెపి విధాన నిర్ణాయక విభాగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికకు ముందు ముఖ్యమైన నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయి మదింపు నివేదికలను పార్టీ కేంద్ర నాయకత్వం తెప్పించుకుంటున్నదని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఉదాహరణకు, ప్రతిష్ఠాకరమైన న్యూఢిల్లీ స్థానం కోసం బిజెపి ఎడిటర్ల నుంచి అధికారుల వరకు పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించింది. కాని వారిలో ఎవ్వరూ గెలవబోరని సర్వేలు సూచించాయి. నటి హేమమాలిని మాత్రమే ఈ స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఎన్నికల సర్వేక్షకుడు సూచించారు. చాందినీ చౌక్ నుంచి న్యూఢిల్లీకి మారాలని పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ గోయెల్ కోరుకుంటున్నప్పటికీ హేమమాలిని అభ్యర్థిత్వానికే అద్వానీ ఆమోదముద్ర వేయవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి.
Pages: -1- 2 -3- News Posted: 10 March, 2009
|