'సర్వే'జనా బిజెపి నినాదం
అయితే, రాజకీయ నిర్బంధాల వల్ల బిజెపి ఒక్కొక్కసారి క్షేత్ర స్థాయి డేటాను పక్కకు పెట్టవలసి వస్తుంది. ఉదాహరణకు, సర్వే ఫలితాలనుకూడా కాదని లాల్జీ టాండన్ ను లక్నే స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించారు. లాల్జీ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి సన్నిహితుడు. రాజకీయ విశ్లేషణ కన్నా సంఖ్యాపరమైన మదింపునకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీ రాజకీయ నిర్వహణ సామర్థ్యం బలహీనపడిందని బిజెపి నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. బిజెపిని తుంగలో తొక్కడానికి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఒకవైపు ప్రత్యామ్నాయ పథకాలు రూపొందిస్తుండగా పార్టీ కేంద్ర నాయకత్వం ఆ విషయాన్ని పసిగట్టలేకపోవడాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సర్వేక్షకులు దీనిని ఊహించలేకపోయారు.
Pages: -1- -2- 3 News Posted: 10 March, 2009
|