పవార్ 'పవర్'ఫుల్ ఎత్తులు!
కాషాయ పరివారంలోనే మరి రెండు పార్టీలు శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఎడి), బిజూ జనతా దళ్ (బిజెడి) కీలక సమయంలో పవార్ కు బాసటగా నిలబడవచ్చు. ఈ పార్టీలకు 14వ లోక్ సభలో వరుసగా 8 మంది, 11 మంది ఎంపిలు ఉన్నారు. 'పవార్ వంటి ఏ నాయకుడైనా' తదుపరి ప్రధాని అయితే తాను సంతోషించగలనని కొన్ని నెలల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి, ఎస్ఎడి అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రకటించిన విషయాన్ని ఎన్ సిపి నాయకుడు ఒకరు గుర్తు చేశారు.
పవార్ చివరకు తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి చెందిన నలుగురు ఎంపిలపై కూడా ఆధారపడవచ్చు. చంద్రబాబు నాయుడు తరచు బారామతి సందర్శిస్తుంటారు. పవార్ తో బాబుకు గల సాన్నిహిత్యం అందరికీ తెలిసినదే. 'జెడి (యు), జెడి (ఎస్) కూడా పవార్ కు మద్దతు ప్రకటిస్తే ఆశ్చర్యపోవలసిన పని లేదు' అని పవార్ సన్నిహితులు ఒకరు అన్నారు. ప్రస్తుత లోక్ సభలో ఆ రెండు పార్టీలకు కలిపి ముగ్గురు ఎంపిలు ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 10 March, 2009
|