దేశం సీనియర్లు ఢిల్లీకే
రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్ధిగా సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపు ఖరారైనట్టే. పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో కలియడంతో అక్కడ బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్ సభ స్థానానికి మరో సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావును నిలబెట్టే అవకాశాలున్నాయి. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తానని చెబుతున్నా, లోక్ సభకే పోటీచేయాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఇటీవలే పార్టీలో చేరిన మాగంటి బాబు ఏలూరు స్థానానికి దాదాపుగా ఖరారైనట్టే. విజయవాడ లోక్ సభ స్థానానికి గతంలో పోటీచేసిన గద్దె రామ్మోహనరావు లేదా గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న వల్లభనేని వంశీ మోహన్ ను నిలబెట్టాలని యోచిస్తున్నారు.
గుంటూరు లోక్ సభ స్థానానికి మాదాల రాజేంద్రను, నరసరావుపేట స్థానానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నిలబెట్టే అవకాశాలున్నాయి. బాపట్ల నియోజకవర్గానికి జెఆర్ పుష్పరాజ్ పేరు పరిశీలనలో ఉంది. ఓంగోలు స్థానానికి కరణం బలరామ్ ను నిలబెట్టాలనుకుంటున్నారు. అయితే జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను మళ్లీ అద్దంకి అంసెబ్లీ స్థానానికే పోటీ చేస్తానని ఆయన చెప్పినప్పటికీ చంద్రబాబు ససేమిరా అన్నారని తెలిసింది. ప్రకాశం జిల్లాలో బలరాం, గరిటయ్యల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అద్దంకి నియోజకవర్గం టిక్కెట్ ను చంద్రబాబు తనకే కేటాయించారని, లోక్ సభకు బలరాం పోటీ చేస్తారని గరిటయ్య ప్రకటించడంతో వారిద్ది మధ్. వివాదం మొదలయింది. నెల్లూరు స్థానానికి వంటేరు వేణుగాపాల్ రెడ్డి పేరు ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేయగా చిత్తూరు పార్లమెంటు స్థానం అభ్యర్ధిగా మాజీ మంత్రి డాక్టర్ శివప్రసాద్ ను ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి స్థానం విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. జిల్లాకు చెందిన శాసన సభ్యురాలు లలికుమారినే నిలబెట్టాలని యోచిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 11 March, 2009
|