దేశం సీనియర్లు ఢిల్లీకే
అనంతపురం స్థానానికి కాల్వ శ్రీనివాసులు, హిందుపూర్ స్థానానికి పారథసారథి దాదాపు ఖరారైనట్టే. కడపకు పాలెం శ్రీకాంత్ రెడ్డిని, కర్నూలుకు కెఇ కృష్ణమూర్తిలను నిలబెట్టాలని చంద్రబాబు నిర్మయించారు. తాను డోన్ ్సెంబ్లీ స్థానానికి పోటి చేస్తానని కెఇ చెబుతున్నాచంద్రబాబు సుముఖంగా లేరని, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశరెడ్డని ఓడించే సత్తా కెఇకే ఉందని భావిల్తున్నారని తెలిసింది. సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు విజయరామారావు పేరు వినబడుతున్నా సికిందరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనీవాస్ యాదవ్ ను ఎంపిక చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానానికి జితేందర్ రెడ్డినే నిలబెట్టాలని నిర్ణయించారు.
Pages: -1- -2- 3 News Posted: 11 March, 2009
|