ముంబైకి 'స్లమ్' టూరిస్టులు
ఎక్స్ పీడియా వినియోగదార్ల అభిప్రాయ సేకరణ ద్వారా పర్యాటక కేంద్రాలను రూపొందించడం జరిగింది. ప్రతి ఏడాది కొత్త జాబితాను సజావుగా ఈ సంస్థ రూపొందిస్తోంది. చిత్రాల్లో చూసిన ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారని ఆ సంస్థ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థర్ హాఫ్ మన్ తెలిపారు. పలు పర్యాటక కేంద్రాలకు విపరీతమైన పేరు ప్రతిష్టలను పలు చిత్రాలు తెచ్చి పెడతాయని స్టిక్ సస్థ డైరెక్టర్ రిచా గోయల్ సిక్రి తెలిపారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ముంబైకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు ఆమె తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు కనీసం అయిదురు పర్యాటకులు ముంబై గురించి వాకబు చేస్తున్నారని ఆమె తెలిపారు. జ్యూరిక్, ప్యారిస్, మాల్దీవ్ ప్రాంతాలకు సినిమాలు విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయని ఆమె తెలిపారు.
సినిమా నిర్మాతలను తమ ప్రాంతాల్లో చిత్రాలను నిర్మించాలని పలు దేశాల టూరిజం బోర్టులు కోరుతున్నాయి. అందుకోసం వారికి పలు రాయితీలు, డిస్కౌంట్లను ఆయా ప్రాంతాల టూరిజం బోర్డులు అందజేయనున్నట్లు ప్రకటించాయి. ఈ రాయితీలు, డిస్కౌంట్ల ద్వారా కోల్పోయే డబ్బు ఆ ప్రాంతాల్లో తీసిన చిత్రాలు విజయవంతం కావడం వల్ల వచ్చే పర్యాటకులతో తిరిగి సమకూరుతుంది. బాలివుడ్ నిర్మాతలు విదేశాల్లో తీస్తున్న చిత్రాల ప్రభావంతో పలు భారతీయులు ఆ ప్రాంతాలకు పర్యటిస్తున్నారు. 'బచనా ఏ హసీనా' చిత్రంతో ఇటలీకి, 'బాంబే టు బ్యాంకాక్' చిత్రంతో థాయ్ లాండ్ కు, 'ఝూమ్ బరాబర్ ఝూమ్' చిత్రంతో ఫ్రాన్స్ కు, 'మిషన్ ఇస్తాంబుల్' చిత్రంతో టర్కీకి భారతీయ పర్యాటకులు విశేషంగా వెళుతున్నారు.
'క్రిష్' చిత్రంతో సింగపూర్ కు, 'డాన్' చిత్రంతో మలేషియాకు భారత మధ్యతరగతి ప్రజానీకం అధికంగా వెళుతున్నారు. ఈ పర్యాటక ప్రదేశాల్లో మిగిలిన విదేశీ పర్యాటక కేంద్రాలతో పోలిస్తే చౌకగా, అందుబాటు ధరల్లో ఉన్నాయి. మలేషియా టూరిజం బోర్డు లెక్కల ప్రకారం 2007లో 32 వేల భారతీయ పర్యాటకుల సంఖ్య 2008లో 49,165 కు పెరిగింది. 2008లో ఈజిప్టుకు 88 వేల మంది భారతీయ పర్యాటకులు సందర్శించారు. 'సింగ్ ఈజ్ కింగ్' చిత్రంతో ఈ ఏడాది ఒక లక్ష మంది భారతీయ పర్యాటకులు ఈజిప్టును సందర్శించనున్నట్లు అంచనా.
Pages: -1- 2 News Posted: 11 March, 2009
|