'రెబెల్స్' మధ్య బాలయ్య
ఒంగోలు: తిరుగుబాటు అభ్యర్ధులతో పాటు గ్రూపు విభేదాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో జిల్లా పర్యటనకు బాలకృష్ణ శ్రీకారం చుట్టారు.జిల్లాలోని పామూరు నుండి ప్రారంభమైన ఆయన పర్యటన ఎనిమిది నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. మరొవైపు జిల్లాలో తెలుగుదేశం అభ్యర్ధుల ఎంపిక ఒ కొలిక్కి రాకుండానే గ్రూపు విబేదాలు తావ్రస్థాయికి చేరుకున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా ఏడు నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక పూర్తి కాగా అసమ్మతి బుసలు కొడుతోంది. పోటీ చేయడానికి తీవ్ర యత్నాలు సాగించున నాయకులు అధినేత వద్ద చుక్కెదురు కావడంతో అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణ పర్యటన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది
ఈ నేపథ్యలో బాలకృష్ణ తప దైన స్టైలులో ప్రసంగించమే కాక అసంతృప్తి తో వున్న నాయకులతో చర్చింవలసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకులు బాచిన చెంచు గరటయ్య, ముక్కు కాశిరెడ్డి లతో పాటు చేగిరెడ్డి లింగారెడ్డి రెబెల్ అభ్యర్ధులుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్యాయి. పర్చూరు అసెంబ్లీ నియోజక వర్గం టిక్కెట్ జాగర్లమూడి పద్మావతికి ఖరారని అనుకుంటున్నప్పటికీ సినీ నటుడు అశోక్ కుమార్ తెరపైకి వచ్చారు. ముఖ్యంగా అద్దంకి, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ స్థానాల విషయంలో నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వీరందర్నీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే బాధ్యత బాలకృష్ణ మీద పడింది. కనిగిరి నియోజకవర్గంలో ముక్కు కాశిరెడ్డి వర్గీయులు బాలకృష్ణ పర్యటనలో అడ్డంకులు సృష్టించ వచ్చని తెలిసింది.
Pages: 1 -2- News Posted: 12 March, 2009
|