అద్దంకి స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించిన గరటయ్య పార్టీ మారుతారా లేక ఇండిపెండెంటుగా పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. గుద్దలూరు నియోజకవర్గంలో చేగిరెడ్డి లింగారెడ్డి ఇండిపెండెం గా బరిలో దిగే అవకాశాలున్నాయి. అయితే బాలకృష్ణ పర్యటన షెడ్యూలులో గిద్దలూరు యర్రగొండపాలెం నియోజకవర్గాలు లేవు. ఒంగోలు నియోజకవర్గం ఈదర హరిబాబుకు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈదరను వ్యతిరేకించే వర్గం పూర్తి గా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కష్టపడి పనిచేసే వారిని కాదని పార్టీలు మారుతున్న వారికి టిక్కెట్లు ఇస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ అవరోధాలను బాలకృష్ణ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.