అటల్ బ్రాండే అద్వానీకి దిక్కు
శీఘ్రగతిని విస్తరిస్తున్న రేడియో నెట్ వర్క్ ను కూడా తన సందేశం వ్యాప్తికి విస్తారంగా ఉపయోగించుకోవాలని బిజెపి విధాన నిర్ణేతలు నిశ్చయించారు. 'మేము జరిపించిన ఒక సర్వే ప్రకారం, ఎఫ్ఎం చానెల్స్ పరిధిలో ఇప్పుడు 288 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందువల్ల రేడియో నెట్ వర్క్ మా లబ్ధి కోసం ఉపయోగపడగలదు' అని సిద్ధార్థ నాథ్ సింగ్ చెప్పారు.
దేశాన్ని కుదిపివేస్తున్న ఆర్థిక మాంద్యం గురించి బిజెపి తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నది. ఇది బిజెపి పునరుత్థానానికి పార్టీ బ్లూప్రింట్ కూడా. అందువల్ల పార్టీ ప్రకటనలలో ఒకటి నిరుద్యోగ సమస్య తీవ్రతను ఎత్తిచూపేదిగా ఉండవచ్చు. గడచిన ఐదు సంవత్సరాలలో కోటిన్నర ఉద్యోగాలు హరించుకుపోగా తాము కోటి ఉద్యోగాలు సృష్టించగలమన్న తన వాగ్దానాన్ని పార్టీ ప్రధానంగా ప్రస్తావించవచ్చు. ముఖ్యమైన సందేశాల వ్యాప్తికి పార్టీ విస్తారమైన మొబైల్ ఫోన్ల నెట్ వర్క్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
Pages: -1- 2 News Posted: 12 March, 2009
|