నోరు విప్పని యవ నేతలు!
ఇక వాయవ్య ముంబైకి చెందిన కాంగ్రెస్ ఎంపి ప్రియా దత్ పని తీరు సగటు కన్నా తక్కువగా ఉంది. ఆమె తన నియోజకవర్గానికి, విధానాలకు సంబంధించి 31 ప్రశ్నలు అడిగారు. నాలుగు చర్చలలో మాత్రమే పాల్గొన్నారు. ఆమె హాజరు కేవలం 46 శాతం. మరొక కాంగ్రెస్ యువ ఎంపి సచిన్ పైలట్ పని తీరు కూడా అదే విధంగా నాసిగా ఉంది. ఆయన ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడిగారు. 12 చర్చలలో పాల్గొన్నారు. కాని సచిన్ పైలట్ పని రోజులలో 82 శాతం హాజరు నమోదు చేసారు. యువ ఎంపిలు అందరిలోకి ఇదే అధికం.
తూర్పు ఢిల్లీ ఎంపి, ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు సందీప్ దీక్షిత్ అయితే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు.ఆయన 38 చర్చలలో పాల్గొన్నారు. ఆయనకు 84 శాతం హాజరు ఉంది. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ పని తీరు కూడా అధ్వాన్నంగా ఉంది. ఆయన సభ పని చేసిన రోజులలో 35 శాతం మాత్రమే హాజరు నమోదు చేశారు. ఆయన ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే చర్చలో పాల్గొన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలు 17.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|