పార్టీలకు మాంద్యం దెబ్బ!
హైదరాబాద్: ఆర్ధిక మాద్యం ఏర్పడిన రోజుల్లో ఎన్నికల ప్రచారం మహాకష్టం అంటున్నారు రాష్ట్ర రాజకీయ నాయకులు. ఈసారి ప్రచార ఖర్చు కోసం కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు రాబట్టడం, విరాళాలు పోగెయ్యడం తలకు మించిన భారంగా పరిణమించిందట! కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు సంపాదించిన కాంట్రాక్టులకు ఇప్పుడు 'ముడుపుల' రూపంలో పార్టీకి ఉదారంగా విరాళాలివ్వాలని ప్రచార నిర్వాహకులు కాంట్రాక్టర్ల చెవుల్లో బాకాలూదుతున్నారు. కాని వాస్తవానికి, ఆర్ధిక మాంద్యాన్ని సాకుగా చూపించి 3,400 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. ఇప్పుడా కాంట్రాక్టర్లు, ముఖ్యంగా ఇరిగేషన్ పనులు చేపట్టినవారు, తమ వంతు వచ్చిందంటున్నారు. పెండింగు బిల్లుల చెల్లింపులు 'క్లియర్' చేస్తేనే పార్టీకి విరాళాలిస్తామని తెగేసి చెబుతున్నారు.
అయితే, అధికార పగ్గాలు చేతిలో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎలాగోలా నిధులు సేకరించ గలుగుతోంది కాని తెలుగుదేశం వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించడానికి అష్టకష్టాలూ పడుతోంది. కొందరు పాత 'మిత్రుల'ను పలకరించబోతే వారప్పుడే తమ విదేయతను కాంగ్రెస్ కు ఫీరాయించేశారట! మాట్రిక్స్, ఆర్.ఎ.కె., నవయుగ, నాగార్జున ,లాంకో గ్రూప్ వంటి పూర్వపు దేశం మిత్ర సంస్థలు ఇప్పుడు కాంగ్రెసి శిబిరంలో చేరిపోయాయి. మధుకాన్, సుజన గ్రూపులు తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలు కలిగి వున్నా ఆర్ధిక మాంద్యం కారణంగా ఇంతకుముందులా ఉదారంగా సొమ్ము సర్దుబాటు చేయలేకపోతున్నాయి.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|