పార్టీలకు మాంద్యం దెబ్బ!
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బడా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. దీనికితోడు కార్పొరేట్ విద్యాసంస్థలను బెదిరించి చంద్రశేఖర్ రావు మరింత చేటు తెచ్చిపెట్టుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవిగారి ప్రజారాజ్యం పార్టీ కూడా తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోంది. కాకపోతే అంతో ఇంతో సొమ్ములున్న దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ విలీనం కారణంగా ప్రజారాజ్యం పరిస్థితి కాస్త మెరుగయిందట! సొమ్ములవేటలో పడిన రాజకీయ నాయకుల బారినుండి తప్పించుకోడానికి, చాలామంది కాంట్రాక్టర్లు తమ సెల్ ఫోన్ల నెంబర్లు మార్చేసి, వాటిని బయటివాళ్లు ఎవరికీ చెప్పవద్దని తమ సిబ్బందికి గట్టిగా చెప్పినట్టు తెలిసింది.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|