ద్రవ్యోల్బణం ఫలాలెవరికి?
మరోవైపు, ఆటా, బాస్మతి బియ్యంల ధరలు నవంబర్ నాటికి చాలా అధికంగా పెరిగిపోయాయి. ఆ తర్వాత నుండి క్రమంగా తగ్గాయి. ఆటా ధర 40 శాతం క్షీణించగా, బాస్మతి బియ్యం ధర 30 శాతం తగ్గిపోయింది. ఫుడ్ బజార్ లో బాస్మతి బియ్యం ధర 57 శాతం తగ్గిపోయింది. టోకు ధరల సూచికలో ఉన్న వస్తువులకు వినియోగ ధరల సూచిక పరిధిలోని వస్తువులకు పోలికే లేదు. దాంతో ఆ రెండు సూచికల మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొంది. టోకు ధరల సూచి గణనీయంగా క్షీణించగా, వినియోగ ధరల సూచిక అతి స్వల్పమైన తగ్గుదలను మాత్రమే నమోదు చేసిందని గణాంకాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రణబ్ సేన్ వివరించారు.
ద్రవ్యోల్బణం తగ్గినంత పరిమాణంలో సరుకుల ధరలు తగ్గలేదు. వినియోగదారుడు చెల్లించే ధరల విషయంలో గత ఏడాది ఆగష్టునాటి అత్యున్నత స్థాయి ద్రవ్యోల్బణ కాలంలో ఉన్న సరకుల ధరలే కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల తాత్కాలికంగా ఉంటుందన్న పెద్ద రిటైలర్ల అపోహల కారణంగా టోకు ధరల క్షీణింపు వినియోగదారునికి అందడంలేదు. ఉదాహరణకు రిపైన్డ్ వంటనూనెల ధరలు 35 శాతం క్షీణించినప్పటికీ వినియోగదారునికి ఆ తగ్గిన ధరకు వంటనూనె లభించడం లేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వం చక్క దిద్దవలసిన అవసరం ఉంది. వినియోగదారుల ధరల సూచిక తగ్గితేనే ద్రవ్యోల్బణం నిజంగా తగ్గినట్లు లెక్క. అంటే ప్రస్తుతం కొనసాగుతన్న నిజ ద్రవ్యోల్బణం 9.70 శాతంగా పరిగణించవలసి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|