బుల్లెట్ ప్రూఫ్ రథాలు!
బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు కోసం మామూరు మూల ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉన్న ఒక మోస్తరు రాజకీయ నాయకులు ఎక్కువగా కోరుతున్నారని జలంధర్ కేంద్రంగా పనిచేసే లగ్గార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ తెలిపారు. ఈ పరిశ్రమకు ఖాతాదారులుగా రాయల్ భూటాన్ ఆర్మీ, పలువురు లిక్కర్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడేందుకు రెండు నెలల ముందు నుండి బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు సంబంధించిన ఎంక్వయిరీలు ప్రారంభమైనాయి. చక్కాలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు కావాలని వారు కోరుతున్నారు. ఇందుకోసం ఆయా వాహనాలను బట్టి 3-15 లక్షల రూపాయల ఖర్చవతుంది. మేము ఒక డజను వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నాము. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పని చాలా వేగంగా చేయవలసి ఉంటుందని ఒక ఆర్మూరర్ తెలిపారు.
బుల్లెట్ వాహనాల డిమాండ్ కేవలం పెద్ద రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాదని ముంబై కేంద్రంగా పనిచేసే పారిఖ్ ఆర్మూరింగ్ కంపెనీ అధినేత శ్రేయ పారిఖ్ తెలిపారు. ఈ కంపెనీ ఖాతాదారుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. 'కేవలం అత్యున్నత రాజకీయ నాయకులకే కాదు, చిన్న చిన్న ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకై బారులు తీరారు. మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల ఎంపిలు, ఎమ్మెల్యేలు తీవ్రమైన వివాదాల్లో కూరుకుపోయారు. అందువల్ల వారందరూ బుల్లెట్ ప్రూప్ వాహనాల కోసం చూస్తున్నారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలు, గ్యాంగ్ వార్ లు, ప్రతీకారంతో కూడిన రాజకీయాలతో కూడిన రాజకీయ నాయకులందరూ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ఎగబడుతున్నారు'అని పారిఖ్ తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 13 March, 2009
|