బుల్లెట్ ప్రూఫ్ రథాలు!
వాహనాలపై ఉన్న షీల్డ్ లను పూర్తిగా తొలగించి తిరిగి స్టీల్ ప్లేట్లతో పునర్నిర్మిస్తారు. ఇందుకోసం 2-3 నెలల కాలం పడుతుంది. అయితే డిమాండ్ పెరిగిపోవడం, ఎన్నికల తరుణం మరింతగా సమీపించడంతో ఈ పనిలో కొన్ని షార్ట్ కట్ ను ఎంచుకున్నారు. ఎంత డబ్బు ఖర్చైనా సరే అర్జెంట్ గా బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు కావాలని పలువురు కోరుతున్నారు. అయితే అది అంత తేలికైన పనికాదని పారిఖ్ తెలిపారు. చక్రాలకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటుకు బదులు 50 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణిస్తున్న చక్రానికి బుల్లెట్ దెబ్బ తాకినప్పటికి స్కిడ్ కాకుండా ఉండేందుకు ఉపకరించే బ్యాండ్ లను చక్కాలకు అంటిస్తున్నారు. అదే విధంగా విండో గ్లాసులకు క్విక్ ఫిక్స్ సెక్యూరిటీ ఫిల్మ్ లను అంటిస్తున్నారు.
2008 ముంబై ఉగ్రవాదుల దాడులు, సార్వత్రిక ఎన్నికల ప్రకటన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ మార్కెట్ 20 శాతం పెరిగింది. ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ అమర్చేందుకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. బుల్లెట్ ప్రూఫింగ్ కోసం సఫారీకి 9 లక్షల రూపాయలు, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కు 20 లక్షల రూపాయలు, మెర్సిడెజ్ లేదా బిఎమ్ డబ్ల్యూ వాహనాలకు 50 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంబాసిడర్ కు కేవలం అయిదు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చువతుంది.
Pages: -1- -2- 3 News Posted: 13 March, 2009
|