బాబు మంత్రాలు-తంత్రాలు
చిత్రం ఏమిటంటే ముప్పై సంవత్సారాలుగా రాజకీయ పార్టీగా ఉన్న తెలుగుకదేశం పార్టీని అభ్యర్ధుల కొరత పీడిస్తోంది. తన ఆలోచనల ప్రకారం వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇద్దామని చంద్రబాబు భావిస్తున్నాగెలవగల సత్తా ఉన్న బిసి కేండేట్ లు పార్టీలో ఆయనకు కనబడటం లేదట. పార్టీ నాయకత్వంలో ఉన్న స్థానిక పెద్దలు జిల్లాల్లో బిసి నాయకత్వాన్ని ఎదగనీయకపోవడమే ఈ దుస్థితికి కారణమని చంద్రబాబు ఇప్పుడు తలపట్టుకుని కూర్చున్నారు. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో వచ్చిన వారే ఈనాటికి ఆయా నియోజక వర్గాలలో నాయకులుగా చెలామణి అవుతున్నారు. ప్రత్యమ్నాయ నాయకత్వాన్ని ఎవరూ ఎదగనీయ లేదు. ముప్పై ఏళ్ళుగా పాత మొఖాలను చూసిన ప్రజలకు వారి గుణగణాలు బాగా తెలిసిపోయి పోయిన ఎన్నికల్లో పక్కన పెట్టేశారు. కాని ఆశ చావని ఈ నాయకులు సీనియర్లం అంటూ చంద్రబాబు ముందుకు రావడంతో సమస్య మొదలైందని అంటున్నారు.
వెనుకబడిన వర్గాల ప్రజలు అత్యధిక శాతం ఉన్న విశాఖపట్నం లోక్ సభ స్థానంలో బిసి అభ్యర్దిని పోటీకి పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని విజయం సాధించగల బిసి నాయకుడు లేరని అక్కడి తెలుగుదేశం నాయకులు అధినేత చెవిలో పోరుపెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సీనియర్ నాయకునిగా ఉన్న మాజీ ఎంపి, వ్యాపారవేత్త, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎంవివిఎస్ మూర్తి పోటీకి ఉవ్విళ్ళూరుతున్నారు కాబట్టి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు అంటిపెట్టుకుని ఉండి, పార్టీకి అండదండలందించిన తమకు అవకాశం ఇచ్చి తీరాలని మూర్తి వర్గీయులు చంద్రబాబుకు హెచ్చరికలాంటి విన్నపం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ పరిస్థితి కూడా అలాంటిదే. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణణ్ణి ఇక్కడి నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్న, గత మున్సిపల్ ఎన్నికల్లో స్వంత నియోజక వర్గం కేంద్రమైన తునిలో ఒక్క వార్డులోనూ తెలుగుదేశాన్ని గెలిపించలేకపోయిన ఈయనను ఏకంగా లోక్ సభకు నిలబెడితే ప్రత్యర్ధి పార్టీల దాడిని తట్టుకోవడం కష్టమని తెలుగుదేశం నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు.ఇక లాల్ జాన్ బాషా లాంటి నాయకుడు అందుబాటులో ఉన్నా సరైన బిసి అభ్యర్ధి దొరికితే చూద్దామని నర్సరావుపేట లోక్ సభ స్థానాన్ని ఇంకా అందుబాటులో ఉంచుకున్నారు. ఒంగోలు జిల్లాలోని పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు సరైన సమాధానం లోక్ సభ స్థానాన్ని బిసిలకు కేటాయించాలని, అప్పుడే అందరికీ అధి ఆమోదయోగ్యమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. హిందూపురం నుంచి పోటీ చేయడానికి పార్ధసారధిలాంటి బలమైన అభ్యర్ధి అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సీటును కూడా వీలైతే బిసిలకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 13 March, 2009
|