బాబాయి కంటె అబ్బాయే బెటర్!
సినీ నటి విజయశాంతి తన పార్టీని టిఆరెస్ లో విలీనం చేసిన తరువాత తెలంగాణలో ఆమె పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని భావించారు. అయితే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని తనకు కేటాయిస్తేనే ప్రచారానికి వస్తానని విజయశాంతి స్పష్టంగా చెప్పడంతో పార్టీ నాయకత్వం నిరాశ చెందింది. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో పర్యటిస్తే మహాకూటమికి ప్రయోజనం కలుగుతుందని టిఆరెస్ నాయకులు భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం, ఉపన్యాసాలను సరిపోల్చడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయని చంద్రబాబు చెబుతున్నారు. అందుకే ఇద్దరి ప్రచారం బాగుందని అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాను ఎన్టీఆర్ వారసుడినని నిరూపించుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తన ప్రసంగాల్లో చంద్రబాబు గురించి అంతగా ప్రస్తావించడం లేదు. తాత పరిపాలనను ప్రస్తుతిస్తూ కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నారు.
Pages: -1- 2 News Posted: 14 March, 2009
|