అడకత్తెరలో పిఆర్పీ!
హైదరాబాద్: దండిగా బ్యాంకు బ్యాలెన్స్, రాజకీయ అనుభవం కలగలిసి, 'విజయం సాధించగల' అభ్యర్థుల కోసం ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్ పి) ఆత్రంగా చూస్తోంది. పార్టీ ప్రస్తుతం విచిత్రమైన ఒక సవాల్ ను ఎదుర్కొంటున్నది. ఢక్కామొక్కీలు తిన్న, పిఆర్ పి టిక్కెట్లు ఆశిస్తున్న రాజకీయ నాయకుల వద్ద ఎన్నికల ఖర్చులను భరించేందుకు తగినంత ధనం లేదు. పుష్కలంగా ఆర్థిక వనరులు ఉన్న ఆశావహులలో చాలా మందికి రాజకీయ విజ్ఞత, అనుభవం కొరవడ్డాయి.
ఉదాహరణకు, ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) నుంచి రాజీనామా చేసి తమ వద్దకు వచ్చిన బి. హనుమంతరావుపై పిఆర్ పి నాయకత్వం దృష్టి నిలిపింది. అయితే, ఇప్పుడు పిఆర్ పి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నది. ఎందుకంటే హనుమంతరావు ఆర్థిక స్తోమతపై పార్టీకి అనుమానాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా, పార్టీ జిల్లా కన్వీనర్, ఆనంద్ గ్రానైట్స్ ఎక్స్ పోర్ట్స్ (పి) లిమిటెడ్ యజమాని అయిన పి.ఆనంద్ పేరుని ఒంగోలు లోక్ సభ స్థానం కోసం పార్టీ పరిశీలిస్తున్నది.
ఆయన ఆర్థిక స్తోమత బాగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, టిడిపిలకు చెందిన ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకులను ఢీకొనగల రాజకీయ నేపథ్యం లేదు. వాస్తవానికి, చిరంజీవికి గణనీయమైన పలుకుబడి ఉన్న ఉత్తర ఆంధ్ర తప్పిస్తే, ఇతర ప్రాంతాలలో పార్టీ ఈ విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నది.
Pages: 1 -2- News Posted: 15 March, 2009
|