అడకత్తెరలో పిఆర్పీ!
దీనితో, మహా కూటమి, కాంగ్రెస్ నుంచి 'ఫిరాయించే నాయకులు' తనను ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించగలరని పిఆర్ పి ఆశిస్తున్నది. అందుకే తన మొదటి జాబితా ప్రకటనను పిఆర్ పి నాయకత్వం వాయిదా వేస్తూ వస్తున్నది. నగదు కొరతను అధిగమించడానికై లోక్ సభ నియోజకవర్గాలలో 'సంపన్న' అభ్యర్థులను నిలబెట్టాలని పిఆర్ పి నాయకత్వం యోచిస్తున్నది. అలా చేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును వారు భరించగలరని పార్టీ భావన.
'ఉదాహరణకు, భూమా నాగిరెడ్డి, టి. చంద్రశేఖర్, సిహెచ్. సునీల్ వరుసగా నంద్యాల, గుంటూరు, కాకినాట లోక్ సభ సీట్లకు పోటీ చేస్తూ, తమ సెగ్మెంట్లలో అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల సంగతి చూడగలరు' అని పార్టీ ప్రతినిధి ఒకరు సూచించారు. ఇది ఇలా ఉండగా, ఈ నెల 21న సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నిర్వహించాలని పిఆర్ పి యోచిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 15 March, 2009
|