ఒకే చిత్రం, అనేక వెర్షన్లు!
ఒక సన్నివేశంలో రక్తపాతం మరీ ఎక్కువడా ఉండి ఉండవచ్చు. ఆ సన్నివేశంలో దానిని కొంత వరకు లేదా పూర్తిగా వారు తొలగించగలరు. ఒక జోకుతో కూడిన సన్నివేశం దేశంలో ఒక ప్రాంతంలో వీక్షకులను అలరించవచ్చు. కాని మరొక ప్రాంతంలో ఎబ్బెట్టుగా తోచవచ్చు. ఆ సీను విభిన్న వర్షన్ ప్రత్యామ్నాయ విజువల్స్ ను ప్రదర్శించవచ్చు లేదా సంభాషణలను వినిపించవచ్చు. కాగా, తాను ఈ ఆలోచనల గురించి బాలీవుడ్ లో ఎవరితో మాట్లాడుతున్నానో పేర్లు వెల్లడించేందుకు రస్కర్ నిరాకరించారు.
'సహకార ఒప్పందం కుదుర్చుకుంటే మా విద్యార్థులు బాలీవుడ్ లో కొద్ది కాలం పని చేయడానికి, లేదా ఇండియా నుంచి ప్రొడక్షన్ సిబ్బంది మా లాబ్ ను సదర్శించడానికి వీలు కలగవచ్చు' అని రస్కర్ సూచించారు. ఆయన 'ఫ్యూచర్ స్టోరీటెల్లింగ్'కు సంబంధించిన మీడియా లాబ్ కేంద్రం కో-డైరెక్టర్ కూడా. ప్లిమత్ రాక్ స్టూడియోస్ నుంచి 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. చలనచిత్ర, టెలివిజన్ స్టూడియో 2010లో మసాచుసెట్స్ లోని ప్లిమత్ లో ప్రారంభం కావచ్చు.
కొత్త టెక్నాలజీల ద్వారా చిత్ర నిర్మాణంలో మరింతగా మార్పు తీసుకువచ్చి, ఆర్థికంగా లాభదాయకంగా చేయడం కొత్త లాబ్ లక్ష్యాలు. ఆ లక్ష్యాల సాధనకు అనువైనవే ప్రోగ్రామబుల్ మూవీలు. 'పలు వర్షన్లతో కూడుకున్న చిత్రం ఇటు సినీ నిర్మాణానికి, అటు టెక్నాలజీకి దోహదం చేయవచ్చు' అని పాల్ జకరియా అనే మలయాళం రచయిత పేర్కొన్నారు. ఆయన 20కి పైగా సంవత్సరాల క్రితం తాను రాసిన చిన్న కథలకు ప్రత్యామ్నాయ ముగింపులు ఇవ్వడానికి ప్రయత్నించారు.
అయితే, విషాదకరమైన ముగింపుతో యువ ప్రేమికుల కథను రాసి ఆతరువాత పాఠకులకు సుఖాంతమైన కథను అందించిన జకరియా మాట్లాడుతూ, తాను మొదట రాసినప్పుడు పాఠకుల గురించి ఆలోచించలేదని, కథా రూపం గురించే ఆలోచించానని చెప్పారు. 'చిత్రాలను, టెక్నాలజీని కలగలిపే అర్థవంతమైన ఏ ప్రయోగమైనా మంచిదే. అయితే, అటువంటి చిత్ర నిర్మాణం కమర్షియల్ కాగలదా అనేదే స్పష్టం కావడం లేదు' అని జకరియా అన్నారు. గతంలో చిత్రాలను లేబరేటరీ స్థాయి టెక్నాలజీకే పరిమితమయ్యేవని రస్కర్ చెప్పారు.
1999 నాటి చిత్రం 'మాట్రిక్స్'లో బుల్లెట్ టైమ్ సీక్వెన్స్ గురించి రస్కర్ ఒక ఉదాహరణ ఇచ్చారు. నటుడు కీను రీవ్స్ బుల్లెట్లను తప్పించుకునే సన్నివేశం అది. దానికి బుల్లెట్ల కన్నా కెమెరా మూవ్ మెంట్ వేగంగ చాలా ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉందని, 'ఇమేజ్-బేస్డ్ రెండరింగ్' అనే లాబ్ స్థాయి టెక్నాలజీని దాని కోసం ఉపయోగించుకున్నారని రస్కర్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 15 March, 2009
|