ఖమ్మం వదలని బాబు
ఖమ్మం లోక్ సభ స్థానాన్ని తెలుగుదేశం తీసుకుని, అక్కడ కాంగ్రస్ అభ్యర్ధి రేణుకా చౌదరిని ఓడించడానికి ప్రముఖ పారిశ్రా మికవేత్త నామా నాగేశ్వరరావును బరిలో దింపాలని ఆయన నిర్ణయించారు. సిపిఎం కూడా ఖమ్మం స్థానం నుంచి తెలుగుదేశ్ అభ్యర్ధే పోటీ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. అలాగే ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వర రావు ఉద్దేశపూర్వకంగా పార్టీ నాయకులను రెచ్చగొడుతూ సీటుకోసం ప్రయత్నిస్తున్నారు తప్ప గెలుస్తామన్న ధీమా ఆయనకు లేదని చంద్రబాబు బహిరంగంగానేవిమర్శిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మంలో తమ అభ్యర్ధి నిలబడితే ఓడిపోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదని, కాంగ్రెస్ అభ్యర్ధి సునాయాసంగా గెలుస్తారని సిపిఐ జిల్లా నాయకులే చెప్పిన విషయాన్ని చంద్రబాబు ఢీల్లీలోని పార్టీ నాయకులకు వివరించారని తెలిసింది.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|