రోడ్ షోలతో ఎన్టీఆర్ సునామీ!
అందుకు భిన్నంగా జూనియర్ ప్రసంగాలు ఉంటుండడంతో తెలుగుదేశంలో పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎన్టీఆర్ తన ప్రసంగాలలో ఇటీవల చంద్రబాబు ప్రకటించిన మనీ ట్రాన్‌సఫర్ స్కీం, కలర్ టీవీ పథకాన్ని జన హృదయాలకు చేర్చడంలో సఫలీకృతులయ్యా రు. అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రత్యక్షంగానూ, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై పరోక్షంగానూ ఆయన చేస్తున్న విమర్శలు జనాన్ని బాగానే ఆలరిస్తున్నాయి.
నూట పాతికేళ్ల వయసున్న కాంగ్రెస్‌తో పని ఏంటని, పాతికేళ్ల ప్రాయమున్న తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే సుఖమని ఆయన చెబుతున్న తీరు కూడా జనానికి నచ్చుతోంది. విమర్శలా కాకుండా ఆయన సామెతలను గుదిగుచ్చి తన ప్రసంగాలలో చేర్చడం వల్ల ప్రత్యర్థి పార్టీల వైఫల్యాల గురించి జనానికి పూర్తిస్థాయిలో సమాచారం అందించడంలో విజయవంతమవుతున్నారు. ఇక, సామా జిక న్యాయాన్ని కూడా అడుగడుగునా ఎన్టీఆర్ ప్రస్తావిస్తున్నారు. అది తాతల నాటి నుంచే టిడిపి అమలుచేస్తూంటే కొత్తగా వచ్చిన వారు చేప్పేదేముంది, చేసేదే ముందంటూ ప్రజారాజ్యాన్ని నిశితంగా విమర్శిస్తున్నారు.
గతంలో చిరంజీవి ఉత్తరాంధ్ర సభలకు యువత అధికంగా హాజ రైతే, సీఎం సభలకు మహిళల సంఖ్య గణనీయంగా వుండేది. చంద్రబాబు టూర్‌లో కేడర్ జోరే అధికంగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా టిడిపి కి జవసత్వాలను పూర్తి స్థాయిలో అందించాడన్నది నిర్వివాదాంశం. ఇప్పటికే రెండు జిల్లాలలో విజయవంతంగా సాగిన జూనియర్ సభకు విశాఖలో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాయని శ్రేణులు నిబ్బరంగా ఉన్నాయి. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వ లసలతో‚ చిక్కిపోయిన తెలుగుదేశానికి ఎన్టీఆర్ రూపంలో సరికొత్త బలం సమకూరుతోంది. దీం తో, ఎన్నికలను ఎడంచేత్తో ఎదుర్కొంటామన్న ఆత్మవిశ్వాసాన్ని పార్టీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|