వైఎస్ కు 'హై' చెక్
హైదరాబాద్: ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీలో కొనసాగిన వైఎస్ రాజశేఖరెడ్డి హవాకు కేంద్ర ఎన్నికల కమిటీ బ్రేక్ వేసింది. లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో వైఎస్ అనుకున్నట్టు జరగడం లేదు. సిటింగ్ ఎంపిలు కొంతమందికి కోత పెట్టాలని ముఖ్యమంత్రి భావించగా, వారికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ రూపొందించిన జాబితాను ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలోని స్క్రీనింగ్ కమిటీ మొక్కుబడిగా చర్చించి ఆమోద ముద్ర వేసింది. కేవలం మూడు సమావేశాల్లో స్క్రీనింగ్ కమిటీ తన బాధ్యతను పూర్తి చేసింది. సాధారణంగా ఏడెనిమిది రోజులు జరగవలసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కేవలం మూడు రోజుల్లో ముగించినట్టు వైఎస్ ఢిల్లీలో చెప్పారు.
అధిష్టానవర్గం ఎలాగూ పరిశీలిస్తుందన్న అభిప్రాయంతో స్క్రీనింగ్ కమిటీలోని అధిష్టానవర్గం ప్రతినిధులు ప్రణబ్ ముకర్జీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ చాలా త్వరగా తమ పని పూర్తి చేసేశారు. అనంతరం ఫెర్నాండెజ్ విఖరులతో మాట్లాడుతూ 'వైఎస్ జాబితా కాదు. డిఎస్ జాబితా కాదు. ఇది కాంగ్రెస్ జాబితా' అని వ్యాఖ్యానిచారు. ఇక్కడిలాగే కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా తమ జాబితాకే గ్రీని సిగ్నల్ వస్తుందని ముఖ్యమంత్రి భావించారు. తనపై విమర్శలతో ఇబ్బంది పెడుతున్న ఎంపిలు హర్షకుమార్(అమలాపురం), మధు యాష్కీ(నిజామాబాద్)లకు టిక్కెట్లు ఇవ్వకూడదనుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం సిటింగ్ ఎంపిలైనందున వారికే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించడంతో వైఎస్ కంగుతిన్నారు.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|