వైఎస్ కు 'హై' చెక్
అలాగే కేంద్ర మంత్రి పురందరేశ్వరికి గుంటూరు టిక్కెట్ ఇవ్వడం ద్వారా సిటింగ్ ఎంపి రాయపాటి సాంబశివరావుకు చెక్ పెట్టాలనుకున్నారు. కాని పురందరేశ్వరికి విశ్కపట్నం టిక్కెట్ కేటాయించడంతో వైఎస్ వ్యూహం దెబ్బతింది. విశాక లోక్ సభ స్థానానికి రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డిని నిలబెట్టాలని వైఎస్ అనుకోగా, రాజ్యస సభ్యులెవరికీ టిక్కెట్ల ఇవ్వరాదని అధిష్టాన వర్గం భావించింది. సిటింగ్ ఎంపిల వ్యవహరాన్ని అధిష్టానవర్గం నిర్ణయించినా ఖాలీగా ఉన్న ఇతర స్థానాలకు అభ్యర్ధుల ఎంపికలో తమ మాటే నెగ్గుతుందని అనుకున్నారు. బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య మన పార్టీ, మన పార్టీ అదినేత కాసాని జ్ఞానేశ్వర్ వంటి వారు ముఖ్యమంత్రి వైఎస్ జాబితాలో ఉన్నారు. అయితే అధిష్టానం నిర్ణయం ప్రకారం చూస్తే వీరికి టిక్కెట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.నల్గొండ లేదా భువనగిరి లోక్ సభ స్థానాన్ని ఆర్ కృష్ణయ్యకు, మల్కాజ్ గిరి లేదా చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్ కు ఇవ్వాలని అనుకున్నారు. కాని అధిష్టానం నిర్ణయంతో వీరికి టిక్కెట్లు దక్కే అవకాశాలు కనిపించడంలేదు.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|