లాలూపై కాంగ్రెస్ రుసరుస!
సోనియా గాంధీ పాశ్వాన్ నివాసానికి వచ్చి ఆయనతో కలసి అల్పాహారం తీసుకున్నారు. ఆ సమావేశం బీహార్ లో సంకీర్ణానికి పెద్ద మలుపు అయింది. చివరకు అది గత లోక్ సభ ఎన్నికల అనంతరం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కి మూల స్తంభంగా నిలచి తగినన్ని సీట్లను రాబట్టడానికి కారణమైంది. 'ఆ స్తంభం బీటలు వారింది' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు వాపోయారు.
అనేక పార్టీలతో కలసి లేదా ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేయాలా అనేది చర్చించేందుకు 'సమయం మించిపోయింది' అని కాంగ్రెస్ నాయకులు అనేక మంది అభిప్రాయం వెలిబుచ్చినప్పటికీ, లాలూ యాదవ్ చర్య ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో, కొంత వరకు తమిళనాడులో సీట్ల పంపకంపై సాగించే సంప్రదింపులను ప్రభావితం చేయనున్నది. ఉత్తర ప్రదేశ్ అయితే ఆ 'రాడార్'లోనే లేదు.
బీహార్ లో కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రంలో సీట్లపై లాలూ, పాశ్వాన్ లతో రాజీకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. 'వారి ఆఫర్ ఆమోదయోగ్యం కాదు. మా కార్యకర్తలు అమితంగా ఆగ్రహం చెందారు. మేము ఆది నుంచి సహకార వైఖరి అవలంబిస్తున్నాం. కాని వారు తిరిగి ఆ వైఖరి అనుసరించడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేయాలని మా కార్యకర్తలు కోరుతున్నారు. వారి మనోభావాలను మేము పట్టించుకోకపోతే వారికి మా మొహం ఎలా చూపించగలం' అని షిండే అన్నారు.
బీహార్ లో 20 సీట్లకు పోటీ చేస్తానని కాంగ్రెస్ ప్రకటిస్తుండడమే కాకుండా లాలా బావమరది సాధు యాదవ్, రామాయ్ రామ్, జై నారాయణ్ నిషాద్ వంటి లాలూ పార్టీ 'తిరుగుబాటు నాయకులకు' టిక్కెట్లు ఇవ్వజూపడం ద్వారా ఆయనకు వెన్నుపోటు పొడవడానికి కూడా ప్రయత్నిస్తున్నది. వారు షిండే నివాసంలో కనిపించారు.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|