ఈ గాంధీకి తొందరెక్కువ!
రాహుల్ కన్నా చాలా సంవత్సరాలు చిన్న అయిన వరుణ్ అందరికీ సుపరిచితుడైన, ఆ తరువాత అమేథి ఎంపి అయిన కజిన్ కన్నా అన్ని విధాలా పైచేయి కావాలని తొందరపడుతున్నట్లుగా కనిపించేవారు. వరుణ్ 2004లో లోక్ సభకు పోటీ చేయాలని ఆకాంక్షించారు. కాని ఎన్నికలలో పోటీ చేయడానికి అవసరమైన కనీస వయోపరిమితి 25 ఏళ్ళకు కొన్ని నెలలు తగ్గడంతో ఆయన పోటీ చేయలేకపోయారు. రాహుల్ తో సమాన స్థితిని పొందేందుకు 2006లో విదిశ నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు బిజెపి టిక్కెట్ కోసం ఆయన బాగా ప్రయత్నించారు. ఆయనకు తిరిగి టిక్కెట్ లభించలేదు.
రాహుల్ వలె వరుణ్ కూడా ఉత్తర ప్రదేశ్ ను తన యుద్ధ క్షేత్రంగా భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు జిల్లాలు ప్రత్యేక అధ్యయన అంశంగా వికేంద్రీకరణ గురించ్ వరుణ్ ప్రాచ్య, ఆసియా అధ్యయన విద్యా కేంద్రం (ఎస్ఒఎఎస్)లో ఎంఫిల్ లో సిద్ధాంత వ్యాసం సమర్పించారు. బిజెపిలో చేరడం గురించి తాను మొదట్లో 'తర్జనభర్జన' పడ్డానని, కాని తనకు మరొక మార్గం లేకపోయిందని వరుణ్ చెప్పారు. నెహ్రూ - గాంధీ కుటుంబ వారసుడు కావడం వల్ల ఆయన ఒక ప్రాంతీయ పార్టీలో లేదా కులతత్వ పార్టీలో చేరడానికి ఇష్టపడలేదు. అయితే, తాను బిజెపిలో చేరుతున్నప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడనని, మతపరమైన అంశాలు ప్రస్తావించబోనని స్పష్టం చేశానని వరుణ్ తెలిపారు. 2002 గుజరాత్ మారణకాండను నివారించడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని వరుణ్ తీవ్రంగా విమర్శించినప్పుడు కలకలం రేగింది. అప్పుడు, ఇప్పుడు కూడా వరుణ్ ప్రవర్తన తీరు బిజెపిని ఇరకాటంలోకి నెట్టింది.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|