కేసిఆర్ కు కొత్త సమస్యలు
ఇటీవల భువనగిరిలో జరిగిన టిఆరెస్ నియోజకవర్గ కార్యకర్తల శిక్షణ శిబిరంలో కెసిఆర్ జిట్టా పేరెత్తపోవడంతో కార్యకర్తలు ఆయన్ను కొట్టినంత పని చేశారు. ఇప్పుడు జిట్టా తెలంగాణ వాదాన్ని అస్త్రంగా చేసుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులన్నీ ఆయనవైపే ఉన్నాయి. ఇక పక్కనే వున్న ఆలేరు నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని డాక్టర్ నగేష్ డిమాండ్ చేస్తుండగా, తమకు కావాలంటూ స్థానికి నాయకులు కొందరు కెసిఆర్ పై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఎస్సీ రిజర్వుడు సిటుగా వున్న ఆలేరు జనరల్ కేటగిరీకి మారింది. ఇప్పుడు అనేకమంది ఆలేరు సీటుకోసం పోటీ పడుతుండడం కెసిఆర్ కు తలనొప్పిగా మారింది.
టిఆరెస్ సాంస్కృతిక విభాగానికి నాయకుడైన రసమయి బాలకిషన్ తనకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గాన్ని కేటాయించాలని కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యే బాలకిషన్ పై పలు ఆరోపణలు వచ్చాయి. భార్య, పిల్లలు ఉండగా, శిష్యురాలిని బలవంతంగా పెళ్లి చేసుకున్నారన్న వివాదం కూడా ఆయనపై ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని ఆరోపణలు వున్న బాలకిషన్ కు టిక్కెట్ ఎలా ఇచ్చారని ఒకవైపు, ఉద్యమానికి ఎనలేని సేవ చేసిన ఆయనకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని మరోవైపు తనను నిలదీస్తారన్న సందేహం కెసిఆర్ ను పీడిస్తోంది.
Pages: -1- 2 -3- News Posted: 19 March, 2009
|