కేసిఆర్ కు కొత్త సమస్యలు
అలాగే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ స్థానంలో టిఆర్స్ కుప్రస్తుతం కెప్టెన్ లక్ష్మీకాంతరావు నాయకత్వం వహిస్తుండగా, సిపిఐ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు చాడ వెంకటరెడ్డి, పునర్విభజనలో తన నియోజకవర్గం మాయంకావడంతో, హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఈ నియోజకవర్గం విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. నల్గొండ జిల్లాలోని భువనగిరి లోక్ సభ సీటుకాని, నల్గొం స్థానంకాని తమకు కేటాయించాలని టిఆరెస్ పట్టుపడుతుండగా, ఆ రెండింటిని వామపక్షాలకు కేటాయించవలసిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురుకావడంతో దీనిపై కూడా సందిగ్ధత నెలకొంది.
ఇక కెసిఆర్ మహబూబ్ నగర్ నుండి పోటీచేయాలని నిర్ణయించుకోవడంతో, అక్కడి నుండి తెలుగుదేశం తరఫున ఉబలాటపడుతున్న మాజీ ఎంపి జితేందర్ రెడ్డి పార్టీ అధిష్టానవర్గంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. టిఆరెస్ లో విలీనమైన తల్లి తెలంగాణ నాయకురాలు విజయశాంతి కరీంనగర్ లేదా మెదక్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయనని స్పష్టంగా చెప్పడంతో కెసిఆర్ ను మరిన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇలా టిఆరెస్ లో ఇంటిపోరు రోజురోజుకు పెరిగిపోతోంది.
Pages: -1- -2- 3 News Posted: 19 March, 2009
|