వోట్ల కోసం కొత్త పోకడ!
దక్షిణ కోలకతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో పోటీ చేసేందుకు సిపిఎం ఎంపిక చేసిన రాబిన్ దేవ్ అయితే ఒక చేపల గాలంతో ప్రత్యక్షమయ్యారు. రాబిన్ దేవ్ తన నియోజకవర్గంలో ఒక సరస్సు వద్ద చేపలు పట్టేందుకు కూర్చున్నారు. ఆ వెంటనే జనం ఆయన వద్ద చేరారు. ఆయన రెండు చేపలు కూడా పట్టుకున్నారు. 'ఇది చాలా కాలంగా నేను కంటున్న కల. చేపలు పట్టేందుకు నాకు అవకాశం వచ్చింది. ఇక ఆగలేకపోయాను' అని ఆయన చెప్పారు. 'నేేను వోట్లు అడగడం లేదు. ఇది నా ఎన్నికల ప్రచారంలో భాగమని ఎవరూ భావించరాదు. నేను జనాన్ని కలుసుకుని వారి సమస్యలు వినడానికి ప్రయత్నిస్తున్నానంతే' అని రాబిన్ దేవ్ పేర్కొన్నారు.
మరొక ప్రముఖ సిపిఎం నాయకుడు, సిట్టింగ్ ఎంపి, డమ్ డమ్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న అమితావ నంది ఇటీవల కొందరు యువకులు క్యారమ్స్ ఆడుతుండగా వారి దగ్గరకు వెళ్ళి తానూ ఆడారు. 'ఇవి ప్రచారానికి, ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి కొత్త మార్గాలు. కాని దీనితో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నదనక తప్పదు' అని సిపిఎం నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|