సైబర్ స్పేస్ లో రెడ్ అలర్ట్!
న్యూఢిల్లీ: 'మార్పు ఒక్కటే మారనిది, శాశ్వతమైనది' అనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మార్క్సిస్టులు సార్థకం చేస్తున్నారు. కంప్యూటరీకరణ పట్ల అంతగా ఉత్సాహం చూపని సిపిఎం బుధవారం సైబర్ స్పేస్ లోకి ప్రవేశించింది. 'బాధిత భారతాన్ని' ప్రదర్శించడానికై సిపిఎం లోక్ సభ ఎన్నికల కోసం తన ప్రచారాన్ని సైబర్ స్పేస్ లో ప్రారంభించింది. ఇండియాలో ఇది అందుబాటులో ఉన్నది కొద్ది మందికే కనుక ఇది మాస్ మీడియం కాదని సిపిఎం అంగీకరిస్తూనే తాము యువతపై దృష్టి పెట్టినట్లు తెలియజేసింది. 'వోటర్లలో 54 శాతం మంది 25 ఏళ్ళలోపు వారేనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మేము ఈ వర్గంపైనే దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయాలని నిశ్చయించాం' అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరి పార్టీ వెబ్ సైట్ ను ప్రారంభిస్తూ చెప్పారు. వోట్లు, నిధుల కోసం ఈ వెబ్ సైట్ లో పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
తన పార్టీ ఇంటర్నెట్ ప్రచారానికి, ఇతర పార్టీల ఆన్ లైన్ ప్రచారాలకు మధ్య తేడా ఏమిటో ఏచూరి వివరించారు. 'బిజెపి వంటి ఇతర పార్టీల ఇంటర్నెట్ ప్రచారాల వలె కాకుండా మొత్తం వెబ్ సైట్ ను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 'ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం' అని ఆయన చెప్పారు. 'ఇండియా షైనింగ్' (భారత్ మెరుస్తోంది) పంథాలోనే పార్టీ ప్రచారం చేస్తోందా అనే ప్రశ్నకు ఏచూరి సమాధానం ఇస్తూ, 'మేము బాధిత భారతాన్ని చూపుతాం' అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|