సైబర్ స్పేస్ లో రెడ్ అలర్ట్!
కంప్యూటరీకరణకు పార్టీ ఆదిలో వెలిబుచ్చిన అభ్యంతరాల గురించిన ప్రశ్నకు ఏచూరి సమాధానం ఇస్తూ, 'కంప్యూటరీకరణ వల్ల ఉద్యోగాలు హరించుకుపోవడాన్నే మేము వ్యతిరేకించాం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మేము కోరాం' అని చెప్పారు. సిపిఎం స్వయంగా ఉచిత సాఫ్ట్ వేర్ ఉద్యమంతో ప్రమేయం పెట్టుకుందని ఆయన తెలిపారు.
వోట్లను కోరడంతో పాటు, చెక్కులు, డ్రాఫ్టులు ఉపయోగించి పార్టీకి నిధులు విరాళాలు ఇన్వవలసిందిగా కూడా ఇంటర్నెట్ వినియోగదారులకు సిపిఎం వెబ్ సైట్ సూచిస్తున్నది. కాంగ్రెస్ పై మార్క్సిస్ట్ వృద్ధ యోధుడు జ్యోతి బసు విమర్శలతో ప్రారంభమయ్యే ఈ ముఖాముఖి వెబ్ సైట్ ను సిపిఎం 'శ్రేయోభిలాషులు, స్నేహితులు' ఏర్పాటు చేశారు. సిపిఎం అభ్యర్థుల వెబ్ సైట్ లో నిర్దుష్ట నియోజకవర్గాలు, సమస్యల గురించి ప్రస్తావన ఉంటుందని ఆయన తెలిపారు. 'వోటు వేయవలసిందిగా జనాన్ని కోరడం, తమ భవిష్యత్ ను రాజకీయాలే నిర్ణయిస్తాయని యువతకు చెప్పడం మా పార్టీ సిద్ధాంతం' అని ఏచూరి తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ, తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రచారాలు ప్రారంభించారు.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|