డామిట్, డిపాజిట్!
రాష్ట్రాల వారీగా జరిపిన సర్వే ప్రకారం 80 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్ధులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ మొత్తం 1,138 మంది అభ్యర్ధుల్లో 907 మంది పరాజితులు డిపాజిట్లు దక్కించుకో లేకపోయారు. వారిలో 481 మంది ఇండిపెండెంట్లు. ఆ తరువాత స్థానంలో ఉన్న తమిళనాడులో మొత్తం 517 మంది అభ్యర్ధుల్లో 493 మంది డిపాజిట్లు కోల్పోగా, వారిలో 102 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు. తరువాత ఉన్న బీహార్ లో 40 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన 462 మందికి 375 మంది డిపాజిట్లు గల్లంతు కాగా, 200 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో నలుగురు మాత్రమే నిర్దేశిత సంఖ్యలో ఓట్లు సాధించగలిగారు. ఆరు జాతీయస్థాయి పార్టీలకు చెందిన 44 మంది, రాష్ట్రస్థాయి పార్టీలకు చెందిన 67 మంది డిపాజిట్లు కోల్పోయారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరుసగా 309మంది, 268మంది అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని 29 లోక్ సభ స్థానాల్లో 294 మంది అభ్యర్ధులు పోటీ చేయగా, 232 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లోని 42 లోక్ సభ స్థానాలకు 279 మంది పోటీ చేయగా 194 మంది డిపాజిట్లు దక్కించుకో లేకపోయారు.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|