బాబు తర్వాత జూనియర్?
ఈసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే, మరికొంత కాలం తరువాత జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీకి నాయకత్వం వహించే అవకాశం వస్తుందని, ఒక వేళ ఇప్పుడు పార్టీ అధికారం చేజిక్కించుకో లేకపోతే మాత్రం తక్షణం కనిపించే ప్రత్యామ్నాయం జూనియర్ ఎన్టీఆరేనని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. బాలకృష్మ తొడగొట్టి ప్రచారం చేస్తుండగా, జూనియర్ మాత్రం అటువంటిదేమీ లేకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. విజయం సాధించిన తరువాత మళ్లీ వచ్చి తొడగొడతానని చెబుతూ పరిణతి ప్రదర్శిస్తున్నారు. దీంతో బాలకృష్ణతో పాటు చిరంజీవి ప్రచార సరళిని కూడా జూనియర్ ప్రచారంతో తెలుగుదేశం నాయకులు సరిపోల్చి చూసుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|