చైనా 'అలీబాబా' వస్తున్నాడు!
కాని వారు ఒక సంగతి కనిపెట్టారు. గ్లోబల్ సైబర్ స్పేస్ లో చైనా వర్తకుల కన్నా భారతీయ వర్తకులకే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నట్లు వారు తెలుసుకున్నారు. 'ఇంటర్నెట్ నా వ్యాపారాన్ని భారీ స్థాయికి పెంచింది' అని ముంబైకి చెందిన కృష్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం అధిపతి నికేష్ రాథోడ్ తెలిపారు. ఈ సంస్థ స్టెయిన్ లెస్ స్టీల్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంటుంది. 'భారతీయ సప్లయర్లకు అంతర్జాతీయ ప్రమాణాలపై అవగాహన ఉంది. వారికి భాష అడ్డుగోడ కాదు' అని అలీబాబా డాట్ కామ్ సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ వెయి పేర్కొన్నారు. చైనాలోని తూర్పు హాంగ్ ఝౌలో ఈ సంస్థ ఇండియా విభాగానికి ఆయన అధిపతి. 'చైనాలో మేము అంతర్జాతీయ వర్తకంలో సప్లయర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది' అని ఆయన చెప్పారు.
చైనా వెలుపల అతి పెద్ద అలీబాబా యూజర్ దేశంగా ఇండియా ఈ సంవత్సరం అమెరికాను వెనుకకు నెట్టగలదని వెయి జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలకు, వాణిజ్య సంస్థలకు నష్టదాయకంగా పరిణమించిన 2008 సంవత్సరం తమ సంస్థ అలీబాబాకు ఏర్పడిన నాటి నుంచి అత్యంత మేలైనదిగా కనిపించిందని జాక్ మా తెలిపారు.
Pages: -1- -2- 3 News Posted: 22 March, 2009
|