మంది కాదు, మార్బలం కావాలి
విజయవాడ: కృష్ణా జిల్లాలో ప్రజారాజ్యంపార్టీని కార్యకర్తల కరవు వేధిస్తోంది! తమ హీరో పార్టీకి ఓట్లు వేయడానికి అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నారు. కాంగ్రెస్, తెలుగుదేసం పార్టీలతో సమానంగా కోట్లాది రూపాయలు ఖర్చపెట్టే సేతోమతు గల అభ్యర్ధులూ ఉన్నారు. లేనిదల్లా ఓటర్లను పోలింగు బూత్ ల వద్దకు తోడ్కొని వచ్చి, తమకు అనుకూలంగా ఓటు వేయించే చాకచక్యం గల కార్యకర్తలేనట! కోస్తా జిల్లాలకు రాజకీయ కేంద్రంగా పేరుపడిన కృష్ణా జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి మంచి స్పందన కనిపించినా, అది ఓటు బ్యాంకుగా ఎంతవరకు మారుతుందనేది ప్రశ్నార్ధకమే! ప్రజారాజ్యం ఆవిర్భవించిన ఇన్నాళ్లకు చిరంజీవి తొలిసారిగా మూడు రోజులపాటు ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లో పర్యటిచారు. మంత్రులు బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు ల కంచుకోటల్లో తన సత్తా ఎంత ఉందో పరీక్షించుకున్నారు.
అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు, గుడివాడ నియజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీకి అభిమానుల స్పందన కనిపించింది. నాగాయిలంక, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో స్వచ్ఛందంగానే జనాలు రోడ్ షోలకు తరలి వచ్చారు. వారిలో కాపు సామాజిక వర్గానికి చెందినవారే అధికులు. ముప్ఫై సంవత్సరాలు వెండితెర మీద కనిపించిన తమ అభిమాన హీరో స్వయంగా కళ్లెదుట కనిపించే సరికి వారంతా తబ్బిబ్బయ్యారు. వయోభేదం లేకుండా రోడ్ షో్లలో కదంతొక్కారు. ఇన్నాల్లకు తమ వర్గం ేతికి అధికారం అందే అవకాశం వచ్చిందన్న భావన వారిలో కనిపించింది. ఈసారి చిరంజీవి పార్టీని గెలిపించకపోతే మరో అవకాశం రాదని ఈ సామాజిక వర్గం బాహాటంగానే వ్యాఖ్యానిస్తోంది. అయితే కృష్ణాజిల్లాలో ప్రజారాజ్యం పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకున్నా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను మాత్రం ఖచ్చితంగా ఖంగు తినిపిస్తుంది.
Pages: 1 -2- News Posted: 23 March, 2009
|