మంది కాదు, మార్బలం కావాలి
రోడ్ షోలలో ప్రజల స్పందన చూస్తే ఈ ఐదు నియోజకవర్గాల్లో పిఆర్పీకి తిరుగులేదని అనిపిస్తుంది. ఇదిలా ఉండగా, ప్రజాబలం తప్పిస్తే, ఆ బలాన్ని బ్యాలెట్ బాక్సుల వద్దకు చేర్చే యంత్రాంగం ఈ పార్టీకి కనిపించడం లేదు. ఎన్నికల సమయెలో ప్రదాన పార్టీలు పటిష్టమైన బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటాయి. దొంగ ఓట్లను నివారించడం, తమ ఓట్లన్నీ పడేలా జాగ్రత్త పడడం, వీలైతే అప్పుడప్పుడు తమ పార్టీకి దొంగ ఓట్లు వేయించడంలో బూత్ కమిటీలకు ముందే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పోలింగు జరిగే ఊళ్లోని మారుమూల వీధుల్లో ఓటర్లు వీరికి గుర్తుంటారు. ఆ ఓటర్లు వచ్చారో లేదో, రాకపోతే ఎలా రప్పించాలో కమిటీ సభ్యులకు తెలుసు. సిపిఐ, సిపిఎం లకు సుశిక్షితులైన బూత్ కమిటీ సభ్యులు ఉంటారు. అందుకే వామపక్షాలు జతకట్టిన ప్రధాన పార్టీలకు ఓటింగు శాతం పెరుగుతుంది. ఇటువంటి యంత్రాంగం లేని లోటు ప్రజా రాజ్యం పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కార్యకర్తలు లేకపోతే ఎంత నష్టమో గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో పిఆర్పీ గుర్తించింది. ఈ మండలంలో కాంగ్రెస్ బలం ఎక్కువ. ఫలితంగా చిరంజీవి రోడ్ షో వెలవెల పోయింది. అనేక గ్రామాల్లో కేవలం వందల సంఖ్యలో జనం హాజరయ్యారు. గ్రామస్థాయిలో కేడర్ లేకనే జనసమీకరణ జరగలేదని తెలిసింది. పోలింగు సమయంలో కూడా ఇదే విధంగా జరుగుతే పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు.
Pages: -1- 2 News Posted: 23 March, 2009
|