రేణుకకు'పల్లేరు'మీద నడకే!
ఖమ్మం నియోజకవర్గంలో రేణుకా చౌదరికి 1999లో దాదాపు 8,000, 2004లో లక్షపైన ఓట్ల మెజారిటీ లభించింది. ఖమ్మం ఎంపిగా రేణుక ఇచ్చిన హామీలు అనేకం అమలుకు నోచుకోలేదు. ఎప్పుడో ఇచ్చిన హామీ మేరకు పనులు మొదలైనా ఇంకా పూర్తికాని ఇర్రేడియేషన్ ప్లాంట్ పూర్తి చేసేస్తామని ఇప్పుడు మళ్లీ చెబుతున్నారు. తల్లాడ మండలానికి వాగ్దానం చేసిన కాటన్ పార్కు పని భూసేకరణతో ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా ఆమె ఇస్తున్న హామీ ఎవరికీ నమ్మశక్యంగా లేదు. ఖమ్మం-కొత్తగూడెం మధ్య విమానాశ్రయం విమానాశ్రయాన్ని నిర్మించేస్తారట! దీనికోసం ఇంతవరకూ ఒక్క ప్రతిపాదన కూడా లేకపోవడమ విశేషం. ఓటర్ల మాట అటుంచి పార్టీ శ్రేణుల్లో కూడా రేణుకా చౌదరి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆమె తన కులానికి చెందిన వారికే తప్ప మిగతా వారి ప్రయోజనం కోసం చేసింది శూన్యమంటున్నారు. ఖమ్మం, వైరా, మధిర మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లు కమ్మకులానికి చెందినవారని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అసలామె నియోజకవర్గంలో కనిపించడమే చాలా అరుదని ఒక వ్యాపారి వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 24 March, 2009
|