కెసిఆర్ కోర్కె తీరింది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తన పంతం నెగ్గించుకున్నారు. కావలసినన్ని సీట్లతో పాటు, ఆశించిన నియోజకవర్గాలను కూడా మహాకూటమి నుంచి రాబట్టుకున్నారు. ఐదారు అసెంబ్లీ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాలను దక్కించుకోడానికి కెసిఆర్ పన్ని వ్యూహంతో కూటమి సారథి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎంబిటికి కేటాయించిన మూడు సీట్లు కలుపుకొని మొత్తం 48 నియోజకవర్గాలకు కెసిఆర్ అభ్యర్ధులను ెంపిక చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి నడిచిన హై డ్రామాకు మంగళవారం అర్ధరాత్రి దాటాక తెర పడింది. కెసిఆర్ పంపించిన నలుగురు దూతలు చంద్రబాబుతో, ఎర్రన్నాయుడుతో వేర్వేరుగా జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్ కలిపి తొమ్మిది లోక్ సభ స్థానాలకు కూడా అభ్యర్ధులను టిఆరెస్ నాయకత్వం ఎంపికచేసే పనిలో వుంది.
తెలుగుదేశం, టిఆరెస్ నాయకుల మధ్య చర్చల్లో ఖరారైన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి హైదరాబాద్లో ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలను టిఆరెస్ కు కేటాయించారని తెలిసింది. మబహూహ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట, మక్తల్ టిఆరెస్ కు ఇవ్వాలని నిర్ణయించగా, షాద్ నగర్ స్థానాన్ని రెండు పార్టీలు కోరుకోవడంతో దానిపై తుది నిర్ణయం జరగేదు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ టిఆరెస్ ఖాతాలో జమ అయింది. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, దుబ్బాక, సిద్దిపేట, మెదక్ స్థానాలను టిఆరెస్ కు కేటాయించగా, గజ్వేల్, జహీరాబాద్, అందోల్, పటాన్ చెరు స్థానాల్లో తెలుగుదేశం, నర్సాపూర్ నియోజకవర్గంలో సిపిఐ పోటీ చేయనున్నాయి.
Pages: 1 -2- News Posted: 25 March, 2009
|