కెసిఆర్ కౌర్కె తీరింది
నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్ సిటీ, ఆర్మూర్, బాల్కొండ స్థానాలను టిఆరెస్ కు కేటాయించారు. నిజామాబాద్ రూరల్, బాన్స్ వాడ, జుక్కల్ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, బోధ్, చెన్నూరు స్థానాలను టిఆరెస్ తీసుకున్నట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, కరీంనగర్, వేమలవాడ, సిరిసిల్ల స్థానాల్లో టిఆరెస్, చొప్పదండి, జగిత్యాలల్లో తెలుగుదేశ్, హుస్నాబాద్ లో సిపిఐ పోటీ చేయనున్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్, బాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి స్థానాల్లో టిఆరెస్, వరంగల్ ఈస్ట్, ములుగు, మహబూబాబాద్, స్టేషన్ ఘన్ పూర్, డోర్నకల్ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు పోటీ చేస్తారు.
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు స్థానాల్లో టిఆరెస్, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ స్థానాల్లో సిపిఎం, దేవరకొండ, మునుగోడు స్థానాల్లో సిపిఐ పోటీ చేసే అవకాశాలున్నాయి. కోదాడ, హుజూర్ నగర్, ూర్యాపేట లేదా తుంగతుర్తి లలో ఒక స్తానాన్ని తెలుగుదేశం తీసుకోనున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో టిఆరెస్ కు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించ లేదు.
Pages: -1- 2 News Posted: 25 March, 2009
|