అలిగిన 'చేవెళ్ళ' చెల్లమ్మ!
తనకు చేవెళ్ళ కలసివచ్చే ప్రదేశమని డాక్టర్ వైఎస్ విశ్వాసం. ఎందుకంటే ఆయన 2004లో ఎన్నికల ప్రచారాన్ని, 2003లో తన పాదయాత్రను హైదరాబాద్ కు దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం నుంచే ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ 2004లో తిరిగిన మార్గాన్నే ఈసారి అనుసరిస్తారుని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన తన ప్రచార పర్యటనను ఏప్రిల్ 21న సాయంత్రం 5 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో ముగిస్తారు.
డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆచారం ప్రకారమే నడచుకున్నారు. ఆయన తన ప్రచారానికి నివాసం నుంచి బయలుదేరినప్పుడు శుభశకునంగా ఆయన భార్య విజయలక్ష్మి ఎదురువచ్చారు. తన భార్యతో కలసి ప్రార్థనలు చేసిన అనంతరం డాక్టర్ రెడ్డి గాంధి భవన్ కు వెళ్ళి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో మాట్లాడారు. డాక్టర్ రెడ్డి ఆలయం, చర్చి, దర్గాలో ప్రార్థనలు జరిపారు. ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఆయన చిలుకూరు బాలాజీ గుడిలో, మొయినాబాద్ చర్చిలో కూడా ప్రార్థనలు జరిపారు. అంతకుముందు డాక్టర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ, తాను తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే, మెట్ట ప్రాంతమైన తెలంగాణను 'గోదావరి డెల్టా'గా మారుస్తానని ప్రకటించారు. 'అవకాశవాదులు' చేస్తున్న 'అసాధ్యమైన' వాగ్దానాలకు మోసపోవద్దని జనాన్ని డాక్టర్ రాజశేఖరరెడ్డి కోరారు.
Pages: -1- 2 News Posted: 26 March, 2009
|