బాబుకు జూనియర్ షాక్!
హైదరాబాద్: యువత విశేషంగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ పై పూర్తిగా భరోసా పెట్టుకోజాలమని తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అనుభవపూర్వకంగా తెలియవచ్చింది. తన అనుంగు స్నేహితుడు, సినీ నిర్మాత వంశీ మోహన్ కు గన్నవరం అసెంబ్లీ టి్క్కెట్ నిరాకరించారనే సంగతి తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో తన రోడ్ షోను రెండవసారి బుధవారం అర్ధంతరంగా నిలిపివేశారు.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ప్రోత్సాహం ఉన్న దాసరి బాలవర్ధనరావుకు గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిశ్చయించినట్లు వంశీ తనకు ఫిర్యాదు చేయడంతో 'బాగా కలత చెందిన' జూనియర్ ఎన్టీఆర్ వెంటనే తన పర్యటనను నిలిపివేయాలని నిశ్చయించుకున్నారు. కొన్ని ఫోన్ కాల్స్, వివరణల అనంతరం, సీటు గురించి హైదరాబాద్ లో చర్చించగలనని టిడిపి అధ్యక్షుని వద్ద నుంచి హామీని రాబట్టిన మీదట జూనియర్ ఎన్టీఆర్ తన రోడ్ షోను తిరిగి ప్రారంభించారు.
కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో ఉదయం చర్చలు జరిపిన చంద్రబాబు నాయుడు విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపి లగడపాటి రాజగోపాల్ పై పోటీ చేయవలసిందిగా వంశీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించడం ఈ సమస్యకు దారి తీసింది. 'తన బావమరిది హరికృష్ణను శాంతింపచేయడానికై గన్నవరంలో దాసరిని నిలబెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు' అని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 26 March, 2009
|