బాబుకు జూనియర్ షాక్!
గన్నవరం సీటు వివాదం ఎంత సంక్లిష్టమైనదో వంశీకి చంద్రబాబు విశదంగా చెప్పినట్లు తెలుస్తున్నది. వంశీ ఒక్క మాట కూడా మాట్లాడకపోయినప్పటికీ పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా తాను వ్యవహరించబోనని హామీ ఇస్తూనే వచ్చారని తెలుస్తున్నది. అయితే, వంశీ ఈ విషయాన్ని తన మిత్రుడు, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. లగడపాటిని ఢీకొనడానికి మరే నాయకుడూ ముందుకు రాకపోవడంతో విజయవాడ నుంచి పోటీ చేయవలసిందని కోరడం ద్వారా తనను చంద్రబాబు బలిపశువును చేస్తున్నారని వంశీ జూనియర్ ఎన్టీఆర్ తో అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
'గన్నవరం నాకు అందుబాటులో లేకుండా పోయింది' అని వంశీ తన మనోభావాలను దాచుకునే ప్రయత్నం చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ తో అన్నారు. 'దీనిని తన పరువుకు సంబంధించినదిగా జూనియర్ ఎన్టీఆర్ భావించి తన పర్యటనను భీమవరం సమీపంలో కొంత సేపు నిలిపివేశారు. దీనితో పార్టీ నాయకులకు ఏమి చేయాలో అంతుపట్టలేదు' అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలకు దిగ్భ్రాంతి చెందిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి, ఆయనను సంప్రదించకుండా గన్నవరం టిక్కెట్ అంశాన్ని తాను ఖరారు చేయబోనని హామీ ఇచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తన పర్యటనను పునఃప్రారంభించారు. వంశీ హైదరాబాద్ లో ఉండగా ఆయన ప్రత్యర్థి దాసరి బాలవర్ధనరావు బుధవారం చంద్రబాబును కలుసుకోకుండానే గన్నవరానికి తిరిగి వచ్చారు.
Pages: -1- 2 News Posted: 26 March, 2009
|