చెదరిన 'అమెరికా కల'
బారత ఆర్ధిక పురోగతి గత మూడేళ్ల నుండి దాదాపు 9 శాతంగా కొనసాగడంతో దేశంలో కొత్త తరం మిలియనీర్లు ఇబ్బడిముబ్బడిగా అవతరించారు. వారందరి ఆర్ధిక కార్యకలాపం యువతరానికి పలు ఉపాధి అవకాశాలను సృష్టించింది. గతంలో అమెరికా, యూరప్ విశ్వవిద్యాలయాల వద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను చేసి, అక్కడే ఆకర్షణీయమైన జీతంగల ఉద్యోగాల్లో స్థిరపడేవారు. ప్రపంచ ద్రవ్యో సంక్షోబం బద్దలు కాగానే స్వదేశంలో చాలా అవకాశాలు కనపడుతున్నాయి. అమెరికా యూరప్ ప్రభుత్వాలు రక్షణ ఆర్ధిక విధానాలను అమలు చేస్తుండడంతో ప్రవాసుల దృష్టి స్వదేశంపైకి మళ్లింది. బారత దేశంలో కూడా అమెరికా స్థాయి షాపింగ్ మాల్స్, కండోమినియంలు ఉండడంతో స్వదేశంలో కూడా విలాసవంతమైన జీవనశైలిని చౌకగా గడిపేందుకు పలు అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ ప్రవాసులను 'ఇంటి బాట' పట్టేట్టు చేశాయి.
అయిదేళ్లలో దాదాపు 10 లక్షల మంది భారతీయ నిపుణులు ఇంటి ముఖం పట్టనున్నట్లు వివేక్ వాధ్వా తెలిపారు. అమెరికాలోని భారతీయ పరిశోధకుడు వివేక్ వాద్వా మేధావుల ప్రతి వలసపై ఒక అధ్యయనాన్ని నిర్వహించి పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఆ పరిశోధకుని అధ్యయన పత్రం ప్రకారం అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిరుద్యోగం 26 ఏళ్ల నాటి గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత దేశంలో ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు మిగతా పాశ్చాత్య ప్రపంచంతో పోలిస్తే మెరుగ్గా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వార్నర్ బ్రదర్స్, ఐబిఎమ్ లాంటి పలు అమెరికా కంపెనీలు తమ కార్యకలాపాలను భారత దేశానికి తరలిస్తుండడం ఈ ప్రతి వలసలకు ఊతం ఇచ్చింది. దాంతోపాటు ఉత్తర అమెరికాలేని పలు ఔట్ సోర్సింగ్ హబ్ లను తొలగించి భారత దేశానికి తరలిస్తుండడంతో ప్రవాసులకు స్వేదేశంపై ఆసక్తి పెరిగింది.
అదే విధంగా బ్యాంకులు విద్యా రుణాలను ఇవ్వడం నిలిపివేశాయి. ప్రపంచ వ్యాప్త సంక్షోభంతో విదేశాల్లో చదువలు కోసం బ్యాంకులు రుణా లిచ్చేందుకు సిద్దపడటం లేదు. అదే సమయంలో అమెరికా విద్యా సంస్థల్లో చదివివ అక్కడే ఆకర్షణీయమైన ఉద్యోగాలు వెతుక్కోగల పరిస్థితులు అసలే లేకుండా పోయాయి. ఈ కారణంగా భారతీయ యువతకు సంబంధించిన అమెరికా స్వప్నం చేదుగా మారింది. పీడకలగా భయపెడుతోంది. దాంతో రూపాయితో డాలరు విలువ విపరీతంగా పెరిగిపోవడంతో అమెరికా చదువులకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఖర్చయిన డబ్బుకు వడ్డీ స్థాయిలోనైనా ఆదాయం ఇవ్వగల ఉద్యోగాలు కరువైనాయి. దీంతో యువతకు అమెరికా పట్ల వైమనస్యత పెరిగింది. దాంతో కథ అడ్డం తిరిగింది.
Pages: -1- 2 -3- News Posted: 26 March, 2009
|