బాలయ్య భుజాలపైనే భారం
ఉత్తరాంధ్ర జిల్లాలలో జూనియర్ ఎన్టీఆర్ పర్యటించి వచ్చినందున తాను తొలుత తెలంగాణ జిల్లాలలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, ఆనవాయితీ ప్రకారం ముందుగా తిరుపతి నుంచి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి చిత్తూరు జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలలో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అటుపిమ్మట కరీంనగర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పర్యటన కార్యక్రమాన్ని ప్రారంభించి రోజుకు కనీసం ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలు సందర్శించాలన ఆయన నిర్ణయించారు.
తెలంగాణలో ఎలా అయినా నాలుగుకు మించి లోక్ సభ స్థానాలకు టిడిపి పోటీ చేసే అవకాశం లేనందున చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల వైపే ఎక్కువగా దృష్టి సారించారు. టిడిపి పోటీ చేస్తున్న 62 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించడానికి పది పన్నెండు రోజులు పడుతుందని, వీలైనన్ని నియోజకవర్గాలలో తన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీకి బాగా పట్టు ఉన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో రెండు రోజుల పాటు పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒకవైపు బాలకృష్ణ, మరొకవైపు చంద్రబాబు, ఇంకొక వైపు తారకరత్న, కల్యాణ్ రామ్ పర్యటించాలని నిర్ణయించారు.
తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 16న జరుగుతున్నందున ప్రచార కార్యక్రమాలను 14 సాయంత్రమే ముగించాలనే నిబంధన ఉన్నందున ఈ నెల 30 నుంచే తన పర్యటనకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేయాలని ఆయన పార్టీ నాయకులను కోరినట్లు తెలిసింది.
Pages: -1- -2- 3 News Posted: 28 March, 2009
|