అంతా 'మహా' మౌనులే!
కాగా, లోక్ సభా నియోజకవర్గాలకు సంబంధించి మహా కూటమిలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో మాత్రం అటువంటి స్థితి లేదు. వివిధ నియోజకవర్గాల విషయమై టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మధ్య విభేదాల అదే విధంగా కొనసాగుతున్నాయి. చర్చల ప్రగతి ఎలా ఉన్నప్పటికీ స్నేహపూర్వక పోటీలు తప్పవని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు.
టిఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సామల వెంకటరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా కార్యకర్తలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. వారు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు వచ్చి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటరెడ్డిపై కార్యకర్తలు దాడి చేశారు. దానితో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సామల వెంకటరెడ్డి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సికింద్రాబాద్ పార్లమెంటరీ సీటు కొనుక్కున్నారని కార్యకర్తలు ఆరోపించారు.
మహా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు ఒక వైపు ఎడతెరపి లేని చర్చలు కొనసాగిస్తూనే మరొక వైపు పరస్పరం పోటీకి సిద్ధం అవుతున్నారు. ఒక వైపు అధిక సంఖ్యలో రెబెల్స్ బరిలో నిలిచే అవకాశం ఉండగా మరొక వైపు కొన్ని నియోజకవర్గాలలో టిడిపి, వామపక్షాలు, టిఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్నేహపూర్వక పోటీలకు సిద్ధం అవుతున్నాయి. సిపిఎం, సిపిఐలకు చెరి 16 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించగా ఆ పార్టీలు చెరి 20 సీట్లను కోరుతున్నాయి.
గతంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య పొత్తు ఉన్నప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాలలో స్నేహపూర్వక పోటీ తప్పలేదని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 28 March, 2009
|