ఎన్టీఆర్ షోలకు తెర?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపయినర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక రోడ్ షోలకు స్వస్తి చెప్పినట్లేనని తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఎన్టీఆర్ కోలు కుని, జనం మధ్యకు మళ్లీ ఎప్పుడొస్తారు? ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న మిగిలిన నియోజక వర్గాల మాటేమిటి? గత రెండు రోజులుగా అభి మానులు, టిడిపి కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్నలివి. పక్కటెముకలు, వెన్నుకు తగిలిన గాయాల కారణంగా ఎన్టీఆర్ కనీసం నాలుగు వారాలపాటు లేచి తిరిగే పరిస్థితి లేదు.
అయితే.. ఆయన తిరిగి జనం మధ్యకు వచ్చే అవ కాశాలు పూర్తిగా కొట్టివేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ఎన్టీఆర్‌ను బహిరంగస భలకు సిద్ధం చేయవచ్చంటున్నారు. తాత ఎన్టీఆర్ మాదిరిగా మొండితనానికి మారుపేరైన ఎన్టీఆర్.. తనకు ప్రమాదం జరిగినప్పటికీ ప్రచారంలో దిగేందుకు ఉత్సా హపడుతున్నారు.ఖమ్మం పర్యటన పూర్తి చేసుకుని, ఉగాదికి ఇంటికి చేరుకునే సమయంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజధానికి తరలివస్తున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై వారు పార్టీ నాయకులను వాకబు చేస్తున్నారు. ఎప్పుడు కోలుకుంటారన్న ఆసక్తి కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదానికి గురయిన రోజు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ టిడిపిపి నేత ఎరన్న్రాయుడుకు ఒక్క శ్రీకాకుళం నుంచి దాదాపు 1200 ఫోన్లు వచ్చాయంటే తన పర్యటనల ద్వారా ఎన్టీఆర్ ప్రజల హృదయాలపై ఏ స్థాయిలో ముద్ర వేశారన్నది స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ ప్రమాదవార్త తెలిసిన వెంటనే రాష్ట్రంలోని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో దేవాలయాలు, చర్చిలు, మసీదులో ప్రార్ధనలు నిర్వహించారు.
Pages: 1 -2- News Posted: 28 March, 2009
|