ఎన్టీఆర్ షోలకు తెర?
ఆయన త్వరగాకోలుకోవాలని ప్రత్యేక యాగాలు కూడా చేస్తున్నారు. మరోవైపు, ఆయన ఆరోగ్య పరిస్థితి గమనించిన వైద్యులు మాత్రం మరో నాలుగు వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే, ఎన్టీఆర్ మాత్రం తాను ప్రచారానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయమని కోరుతున్నట్లు సమాచారం. ఈ దశలో పార్టీ నేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబుచేయడం ఆసక్తికరంగా మారింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్‌ను వారం రోజుల తర్వాత డిశ్చార్జి చేయవచ్చంటున్నారు. అయితే.. మునుపటి మాదిరిగా రోడ్‌షోలకు పంపించకుండా, హెలికాప్టర్ ద్వారా పట్టణ, మండల ప్రధాన కేంద్రాల్లో బహిరంగసభలు ఏర్పాటు చేయించి ప్రసంగాలకు పరిమితం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దానితో పాటు గతంలో ఎన్టీఆర్ తరహాలో వీడియో, ఆడియో సందేశాలు కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది. బహిరంగ సభలు నిర్వహించిన సందర్భంలో ఎన్టీఆర్‌తో ఫోన్ ద్వారా సందేశం ఇప్పించే ఏర్పాట్లు చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు.
ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగిన వైనం అటు ఆయనకు, ఇటు పార్టీపై మరింత సానుభూతిని పెంచింది. ఆయన రాకతో టిడిపిలో చైతన్యం రావడమే కాకుండా.. ప్రజల ఆలోచనలను పార్టీ వైపు మళ్లించింది. 2004 ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రలో దెబ్బతిన్న పార్టీ, ఎన్టీఆర్ పర్యటన తో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామాలకు గ్రామాలే ఆయన వెంటనడవడం పరిశీలిస్తే ఎన్టీఆర్ ప్రభావం, స్పందన ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఆయన రాకకోసం గంటలపాటు వేచి చూశారు. ఇవన్నీ ఎన్టీఆర్‌పై సానుభూతి పెంచడానికి దోహదపడ్డాయి.
Pages: -1- 2 News Posted: 28 March, 2009
|