వణకుతున్న అగ్ర నేతలు
ఇది ఇలా ఉండగా, చిరంజీవి ఇటువంటి పరిస్థితిని ముందుగా ఊహించే జిల్లా పర్యటనలో ఉండగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయినప్పటికీ ప్రజారాజ్యం కార్యాలయానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని పిఆర్పీ కార్యాలయానికి శనివారం బాధ్యులైన నాయకులు ఎవరూ రాకపోవడంతో అది బోసిపోయి కనిపించింది. తమ వర్గానికి చెందిన నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని కొందరు, ఇవ్వలేదని మరికొందరు కార్యకర్తలు జిల్లాల నుంచి వచ్చిన చేస్తున్న హడావుడి, ధర్నాలు తప్పించి పిఆర్పీ కార్యాలయంలో నిశ్శబ్దం రాజ్యమేలింది.
పార్టీ రెండవ జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేస్తామని పార్టీ అధినేతలు హడావుడి చేశారు. కాని తమ ఆలోచన మార్చుకుని వారు శనివారం ఉదయం 10 గంటలకు జాబితా విడుదల చేస్తామని చెపుతూ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీనితో మీడియా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడినప్పటికీ సరైన సమాచారం అందజేసేందుకు ఏ నాయకుడూ ముందుకు రాలేదు. రాత్రి 8 గంటల తరువాత జాబితాను ఖరారు చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
కనీసం స్థానికంగా ఉన్న శివశంకర్, పరకాల ప్రభాకర్ వంటి నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి రాకుండా ముఖం చాటేశారు. ఒక వైపు అన్ని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ప్రజారాజ్యం కార్యాలయంలో కీలకమైన నాకులు ఎవరూ అందుబాటులో లేకపోవడం జిల్లాల నుంచి ఎంతో ఆశతో వచ్చిన కార్యకర్తలు, నాయకులు నిరాశగా వెనుకకు తగ్గారు. ఇది ఇలా ఉండగా, టిడిపి, టిఆర్ఎస్. వామపక్షాల అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి రానందున అక్కడ టిక్కెట్లు రాని ప్రముఖులు ఎవరైనా తమ గూటిలోకి వస్తారనే ఆశతో పిఆర్పీ చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఖరారు చేయకుండా గుంభనంగా ఉంచినట్లు తెలుస్తోంది.
Pages: -1- -2- 3 News Posted: 29 March, 2009
|