దేశానికి మళ్లీ డిఎ దెబ్బ!
హైదరాబాద్: రాష్ట్రంలోని పెన్షనర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారా? అని తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. పైన పేర్కొన్న వర్గాలవారు మౌఖికంగా ప్రచారం చేసి ఓటర్లను చైతన్యవంతులను చేయగలరని, 2004 ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రముఖ పాత్ర నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలతో విసుగెత్తిపోయిన ఉద్యోగులలో అధిక శాతం కాంగ్రె పార్టీకి ఓటు వేయడమే కాకుండా మిగతా ఓటర్ల చేత కూడా కాంగ్రెస్ కే ఓట్లు వేయించారు. అప్పట్లో పోస్టల్ బ్యాలట్లలో సుమారు 80 శాతం కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా పడ్డాయి.
ఆ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలలో 50 శాతం పెంచుతూ వేతన సవరణను ఆమోదించింది. వేతన సవరణతో పాటు ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యంలో 9.42 శాతం హెచ్చింపు ఉద్యోగుల్లో మెజారిటీ శాతాన్ని అధికార పార్టీకి అనుకూలంగా మార్చవచ్చని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. క్రితంసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన సుమారు 3 లక్షలమంది పెన్షనర్లు, ఈ సారి కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|