లగడపాటికి అంతటా రగడే!
ఈ ప్రచారానికి కోనేరు రంగారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంచి రామారావు దూరంగా ఉన్నారు. అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన కొండపర్వ అనే గ్రామం నుంచి లగడపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే గ్రామంలో తమ కుటుంబాలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని మహళలు ఆయనను నిలదీయడం విశేషం. జగ్గయ్యపేట, నందిగామ నియేజకవర్గాల్లో కూడా ఆయనకు ఇలాంటి చేదు అనుభవాలు తప్పడం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ను మాజీ మేయర్ మల్లికా బేగమ్ కు ఇప్పించడంతో స్థానికి నాయకులకు రాజగోపాల్ దూరమయ్యారు. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో సొంత గూటిలోని అసమ్మతి పొగ లగడపాటిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు జనం నుంచి కూడా స్పందన అంత్ంత మాత్రం కావడంతో ఆయన వర్గీయుల్లో అసహనం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎన్నికల ప్రచార బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించి, తాను రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేయడానికి లగడపాటి రంగం సిద్ధం చేసుకున్నారు.
లగడపాటిని అన్ని రంగాల్లోనుఢీకొన గలిగే నాయకుడు ఇతర పార్టీల్లో లేరు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేయనున్న చనుమోలు రాజీవ్ ల నుంచి పోటీ అంతంత మాత్రమే అనే ధీమాలో ఆయన ఉన్నారు. తమకు ప్రతికూలంగా ఉండే ఓటర్లను చివరి నిముషంలో తమవైపు తిప్పుకోవడానికి వీలుగా యంత్రాంగాన్ని తయారు చేసుకున్నారు. అయితే వామపక్షాలతో జట్టుకట్టిన తెలుగుదేశం లగడపాటి ఎత్తుగడలను అడ్డుకునే వ్యూహాన్ని అప్పుడే రచిస్తోంది. దీనికి తోడు ప్రజారాజ్యం పార్టీ లగడపాటి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు లక్ష ఓట్లను సులువుగా చీల్చుతుందని, అందులో 70 శాతం కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 31 March, 2009
|